Advertisement
బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలోకి అడుగు పెట్టింది. 14 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్లో ఇప్పుడు 12 మంది ఉన్నారు. గేమ్ ఎలా ఆడాలో, ప్రత్యర్థులను ఎలా ఇబ్బందుల్లో పెట్టాలో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. నైనిక, నాగ మణికంఠ, విష్ణు ప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, పృథ్వి నిలబడ్డారు. సిల్లీ రీజన్స్ కాకుండా మంచి పాయింట్లు పట్టుకుని నామినేషన్ వేశారు.
Advertisement
గత సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు బిగ్ బాస్ కి బాగా కలిసి వచ్చింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీని వాడాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ముక్కు అవినాష్, జ్యోతి రాయి, గీతూ రాయల్ సహా పలువురు పేర్లు వచ్చాయి చివరికి ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన బేబక్క కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తుందని పుకార్లు వచ్చాయి. అసలు వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందా లేక మరి ఏదైనా కొత్త స్టేటస్ వాడుతార అనేది సస్పెన్స్ గా మారింది.
Advertisement
Also read:
వైల్డ్ కార్డు లిస్టులో మరో పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వల మాధురి. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఈ వివాదంతో ఆమె పాపులర్ అయ్యారు. మరి నిజంగా ఆమె బిగ్ బాస్ కి వస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!