Advertisement
ఐపీఎల్ 2023 కు ముందు ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్స్ ను చాలా ఎంటర్ టైన్ చేసే… కరేబియన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందిన కరేబియన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటివరకు తాను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నట్లు ప్రకటించాడు.
Advertisement
READ ALSO : కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై BCCI భారీ కుట్ర! కోచ్ పదవి ఔట్ ?
అటు డ్వేన్ బ్రావో ను బౌలింగ్ కోచ్ గా నియమించిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీపతి బాలాజీ ఏడాది పాటు కోచింగ్ కు దూరంగా ఉండనుండడంతో అతని స్థానంలో డ్వేన్ బ్రావో తమ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తాడని సూపర్ కింగ్స్ తెలిపింది. సూపర్ కింగ్స్ అకాడమీకి బాలాజీ సేవలు అందుబాటులో ఉంటాయని సీఎస్కే స్పష్టం చేసింది.
Advertisement
కాగా ఇప్పటివరకు 161 ఐపిఎల్ మ్యాచ్ లు ఆడిన డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీశాడు. దాదాపు 130 స్ట్రైక్ రేట్ తో 1560 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో బ్రావో కీలక పాత్ర పోషించాడు. 2011 నుంచి సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న డ్వేన్ బ్రావో, ఆ జట్టు 2011, 2018, 2021లో ఐపీఎల్ గెలవడంతో పాటు, 2014లో ఛాంపియన్స్ లీగ్ టి20 గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. రెండుసార్లు పర్పుల్ క్యాప్ సాధించిన తొలి విదేశీ బౌలర్ గా డ్వేన్ బ్రావో రికార్డు క్రియేట్ చేశాడు. 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డ్వేన్ బ్రావో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 144 మ్యాచ్ లు ఆడిన ఈ కరేబియన్ ఆల్ రౌండర్, ఫ్రాంచైజీ తరపున 168 వికెట్లు తీయడంతో పాటు, 1556 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కిరన్ పొలార్డ్ కూడా ఇటీవలే ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
READ ALSO : కామెంట్రీ చెబుతూ కుప్పకూలిన ఆసీస్ దిగ్గజం..ఆస్పత్రికి తరలింపు !