Advertisement
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని. అక్టోబర్ లో జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లిపోతారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిపై మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. నవంబర్ లో నోటిఫికేషన్ పక్కా.. డిసెంబర్ నాటికి ఎన్నికలు ఉంటాయని అనేక రకాల కథనాలు వండి వడ్డిస్తున్నారు. అయితే.. ముందస్తు వార్తలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.
Advertisement
మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై జరగుతున్న ప్రచారాలు మీడియా సృష్టి తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని.. గత ప్రభుత్వ హాయంలో ఉన్న అప్పులు ఎంత.. ఇప్పుడు తీసుకున్న అప్పులు ఎంతో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Advertisement
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. పరిపాలనా వికేంద్రీకరణ ప్రధాన అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. తమ పార్టీ విధానానికి కట్టుబడే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితే లేదని, ఇప్పుడున్న దానికంటే దిగజారతారని జోస్యం చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో మార్పులు ముఖ్యమంత్రి పరిధిలోని అంశమన్నారు.
ముందస్తు ఎన్నికల ప్రచారం మీడియా తన రేటింగ్స్ పెంచుకోవడానికి చేస్తున్న హంగామా అని మాజీ మంత్రి పేర్నినాని కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఇటు ఎంపీ మార్గాని భరత్ తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదన్నారు. ప్రజలు ఆశీర్వదించినట్టుగా ఐదేళ్లు పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలెపిస్తాయనే ఆశాభవంతో ముందుకు వెళ్తామని చెప్పారు.