Advertisement
ఈ భూమ్మీద అవసరం రాని వస్తువంటూ ఏది ఉండదు. ప్రతీ దానితో ఏదో ఒక సమయంలో ఉపయోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు హాని కలిగించే వస్తువు అయినా సరే, ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉపయోగించవలసి వస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో కోడిగుడ్లు వండుకొని తిన్నప్పుడు దాని పైన ఉండే పెంకు ను పెంకే కదా అని పడేస్తూ ఉంటాం. కానీ ఆ పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలియదు. మరి ఆ పెంకుతో ఏ విధంగా సంపాదిస్తారో మీరు కూడా ఓ లుక్కేయండి..?
Advertisement
మన ఇంట్లో కోడి గుడ్డు పెంకు కదా అని పడేస్తాం. కానీ కోడి గుడ్డు లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్ చెబుతూ ఉంటారు. రోజూ గుడ్డు తినడం వల్ల అనారోగ్యం బారిన పడడం తక్కువవుతుంది. అందుకే గుడ్డు తిని పెంకు ను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ అక్కడ మహిళలు పెంకు ను పడేయకుండా భద్రపరుస్తారు. దాంతో లక్షల్లో సంపాదిస్తున్నారు. పెంకు తో లక్షలు సంపాదించడం ఏంటండీ అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ.. పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూడండి..? సాధారణంగా కోడి గుడ్డు పొట్టుని మొక్కలకు ఎరువుగా వేస్తూ ఉంటారు. కానీ ఛత్తీస్గఢ్ లోని మహిళలు ఇంకాస్త వెరైటీ గా ఆలోచించి కోడి గుడ్డు పొట్టు తో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించారు.
Advertisement
అంబికా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, ఈ కోడిగుడ్డు పెంకు ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా సహకరిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా పెంచుతున్నారు. ఈ కోడి గుడ్డు పెంకు తో క్యాల్షియం పౌడర్ తో పాటుగా మొక్కలకు ఎరువులను కూడా తయారు చేయడం పై అవగాహన కల్పిస్తున్నారు. ఆ పొడిని పూలు,పండ్లు,కూరగాయల పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా నెలకు పన్నెండు వేల నుంచి 40 వేల వరకు సంపాదిస్తున్నారు.
also read;
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!