Advertisement
వానా కాలంలో మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి..? ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు అనే విషయాన్ని ఈరోజు చూసేద్దాము. వానా కాలంలో మనం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకుంటే, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. వానా కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఆరోగ్య సమస్యలు కలుగుతుంటాయి. చాలామంది వాన కాలంలో వేడివేడి ఆహార పదార్థాలని తినడానికి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. దాని వలన ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది. వానలో వేడివేడి బజ్జీలు లేదంటే ఉల్లిపాయతో చేసిన పకోడీలు ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఇటువంటివి తినడం వలన త్వరగా అవి జీర్ణం కాదు. అజీర్తి సమస్యలు వస్తాయి.
Advertisement
Advertisement
ఆయిల్ ఫుడ్ ని తీసుకోవడం వలన త్వరగా జీర్ణం అవ్వక ఇబ్బంది పడాలి. ఆకుకూరలని వాన కాలంలో అసలు తినకూడదు. ఆకుకూరల్లో చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. వేడి చేసినా కూడా అవి తగ్గవు. వానా కాలంలో మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి. వానా కాలంలో చేపలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ప్రమాదకరమైన క్రిములు అందులో దాగి ఉంటాయి దాంతో ఆరోగ్యం బాగా పాడవుతుంది. వానా కాలంలో అల్లంతో చేసిన కషాయాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావు. కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
Also read: