Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట బాదం పాలు కంటి నిండా నిద్రపోవడానికి సహాయపడతాయట. బాదంపాలు రాత్రి పూట తీసుకుంటే మంచి నిద్రని పొందవచ్చు అలాగే రాత్రిపూట నిద్రపోవడానికి ముందు గ్రీన్ టీ తాగితే మంచిది. సాయంత్రం కానీ రాత్రి కానీ గ్రీన్ టీ తీసుకోవడం వలన మంచి నిద్ర పడుతుంది. నిద్రపోతే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Advertisement
అలానే చమోమిలే టీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ టీ తీసుకోవడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయట. నిద్ర కూడా బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు అన్నారు. చెర్రీ జ్యూస్ కూడా ఇందుకు సహాయం చేస్తుంది. చెర్రీస్ కానీ చెర్రీస్ జ్యూస్ కానీ తీసుకుంటే వాటిలో ఉండే మెలటోనిన్ రాత్రిళ్ళు నిద్ర పట్టడానికి సహాయం చేస్తుంది. అలాగే పసుపు వేసిన పాలు తీసుకుంటే కూడా రాత్రిళ్ళు చక్కటి నిద్రని పొందవచ్చు.
Advertisement
Also read:
అశ్వగంధ టీ తీసుకుంటే కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవడానికి అవుతుంది. పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తీసుకుంటే కూడా రాత్రిళ్లు చక్కగా నిద్ర పడుతుంది. ఇలా వీటితో మంచి నిద్రని పొందవచ్చు. మరి ఇక నిద్ర పట్టలేదని ఇకమీదట బాధపడకుండా ఈ చిట్కాలని పాటించి మంచి నిద్రని పొందండి. ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోండి. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!