Advertisement
శీతాకాలం చలిని మాత్రమే కాదు, దాంతోపాటు ఎన్నో సమస్యలను తెస్తుంది. చలికాలంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులు సంభవిస్తాయి. చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు చలికి బుగ్గలు ఎర్రగా, చేతులు పొడిగా మారతాయి. పెదాలు, పాదాల పగుళ్లు, చర్మం చెట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనితోపాటు ఈరోజుల్లో బ్యాక్టీరియా, వైరస్ లు కూడా చాలా వ్యాప్తి చెందుతాయి. ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీర్చుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
Advertisement
Read also: బేకరీ ఓనర్ తో సానియా నిశ్చితార్థం..మాలిక్ ఈ విషయం తెలీదా ?
Advertisement
అయితే చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. శరీరంలో రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆ సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. చలికాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు తినే ఆహారంతో పాటు పండ్లలో అంజీర్ పండ్లను కూడా తీసుకోవడం చాలా ప్రయోజనకరం. అంజీర్ ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఇలాగే ఉన్నాయి. శీతాకాలంలో అంజీర్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అంజీర్ లో ఉంటాయి. జలుబు మరియు ఫ్లూ వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇవి పనిచేస్తాయి. అందుకే అత్తిపండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
అత్తిపండ్లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. శీతాకాలంలో వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండులో ఉండే పోషకాలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాక ఇది దగ్గు సమస్యను కూడా దూరం చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, వంటి పోషకాలు అత్తిపళ్ళలో ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చడానికి పనిచేస్తాయి. ఇలా శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. ఒకవేళ గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.