Advertisement
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే.. తన సొంత పార్టీ లీడర్లకు చిక్కులు వస్తున్నాయి. తాజాగా, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుకు ఈడి షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన రూ. 80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడి వెల్లడించింది.
Advertisement
గతంలో బ్యాంకు రుణాలు దారి మళ్లించిన ఆరోపణల మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం ఆరు చోట్ల సోదాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించింది. అలాగే రాంచి ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపీగా పనిచేసిన నామ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. టిడిపి అధ్యక్షుడికి అత్యంత దగ్గర సన్నిహితుడుగా పేరుపొందిన నామ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు.
Advertisement
ఇక అటు సిబిఐ కోర్టులో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ లను సోమవారం సిబిఐ కోర్టు కొట్టి వేసింది. ఓఎంసి కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి అభ్యర్థనను కోర్టు త్రోసిపుచ్చింది. మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీ ఖాన్, రిటైర్డ్ అధికారులు కృపానందం, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లను సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం కేసుల అభియోగాల నమోదుపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. ఓఎంసి కేసు విచారణను వేగంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలనే ఆదేశించింది. దీంతో ఓబులాపురం గనుల మైనింగ్ కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది.
READ ALSO : రాజకీయాలకు మంత్రి రోజా గుడ్ బై ?