Advertisement
ఈరోజుల్లో చాలామంది పెద్ద చదువులు చదువుకుంటున్నారు. పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నారు. అయినా కూడా వారి యొక్క ఆలోచన విధానం మారడం లేదు. ఈ రోజుల్లో అబ్బాయిలు లాగే అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేసే ఆడవాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు కానీ పెళ్లి తర్వాత భర్త కారణంగా ఉద్యోగాన్ని మానేసి కలలని ఆశయాలని చంపేసుకుంటున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకునే ముందే అమ్మాయిలు వారి యొక్క కలల గురించి వాళ్ళ యొక్క ఉద్యోగం గురించి వర్ణించి ఆ అబ్బాయితో చెప్పుకోవాలి. అబ్బాయి ఒప్పుకొని ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తే, అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోండి. లేదంటే అనవసరంగా మీ కలల్ని మీరు చంపేసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది.
Advertisement
Advertisement
ఈరోజుల్లో కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చాలా మంది అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం లేదంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు కనుక కష్టపడుతున్నట్లయితే కచ్చితంగా పెళ్లి సంబంధం వచ్చినప్పుడే తెగేసి చెప్పాలి లేకపోతే ఇప్పటివరకు మీరు పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. మీరు చదువుకున్న చదువు ఉద్యోగం చేయకుండా ఇంటి పనులకి ఏమాత్రం ఉపయోగపడదు. ఒకవేళ కనుక మీరు కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే కచ్చితంగా అమ్మాయిలు మీరు పెళ్లి మాటలప్పుడే చెప్పుకోవాలి కాబట్టి ఉద్యోగం చెయ్యాలన్న జీవితంలో అనుకున్నది సాధించాలన్నా మీరు ఏం చేయాలనుకుంటున్నారు.. ఏం సాధించాలనుకున్నారనేది చెప్పి ఆ తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోండి.
Also read: