Advertisement
119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు నవంబర్ 30, 2023న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3 కోట్లకు పైగా ఉన్నారు. రాష్ట్రంలో 17 లక్షల మంది ఓటర్లు ఓటింగ్ జాబితాలో చేరారు. తెలంగాణ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 3న ప్రకటించనున్నారు.అయితే అభ్యర్థి నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10. పైగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి నవంబర్ 15 చివరి తేదీ. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Advertisement
తెలంగాణలో తొలిసారిగా, 80 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం తెలిపారు. అయితే.. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. డిసెంబర్ 3 వరకు ఈ కోడ్ అమలులో ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలతో పాటు.. వాటిని అందించే విషయమై ఆంక్షలు కూడ ఉంటాయి.
Advertisement
అలాగే గతంలో ప్రారంభించిన పథకాలపై ఫిర్యాదులు అందినా కూడా ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు లోబడే ప్రజా ప్రతినిధులు పని చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా సరే ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుకుని ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండదు. ఎన్నికలు పూర్తి అయ్యేదాకా యాభై వేల రూపాయల వరకే తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ఎన్నికల అధికారులు సీజ్ చేస్తారు.
మరిన్ని..
ఒకవేళ చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయినా.. తర్వాత ఏమి జరుగుతుందంటే?
ఇకపై ఏపీలో ఎన్టీఆర్ సినిమాలు ఆడడం కష్టం అవుతుందా? అసలు ఈ చర్చ ఎందుకంటే?