Advertisement
విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా కరెంట్ బిల్లును కట్టడానికి మార్గం ఈజీగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఫలితంగా జూలై 1 నుంచి కరెంటు బిల్లులు చెల్లింపులు థర్డ్ పార్టీ యాప్ లలో నిషేధించిన విషయం తెలిసిందే. విద్యుత్ బిల్లులు చెల్లింపులను సరళీకృతం చేయడానికి తెలంగాణలో TGSPDCL, TGNPDCL ఏపీలో అయితే APSPDCLలు భారత్ బిల్ పేమెంట్ సిస్టం లో చేరాయి. డిస్కములు రావడంతో బ్యాంకులు ప్రింట్ యాప్స్, వెబ్సైట్లతో పాటుగా బీబీపీఎస్ ఆధార్ కార్డ్ ప్లాట్ ఫామ్ల ద్వారా కూడా కరెంట్ బిల్లుల్ని ఈజీగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
విద్యుత్ సంస్థలు బీబీపీఎస్‌లోకి చేరుతుండటంతో UPI చెల్లింపులకు మార్గం ఈజీ అవుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్ ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తుంది. గూగుల్ పే అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చాని అధికారి తెలిపారు. యూపీఐ యాప్ ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం వలన డిస్కములపై భారం పడుతుంది.
Also read:
ప్రతి లావాదేవికి రెండు రూపాయలతో పటు అదనంగా జీఎస్టీ ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రతి నెల 15 కోట్ల వరకు రెండు డిస్కంలపై అదనపు భారం పడనుంది. గూగుల్ ప్లే స్టోర్ లో TGSPDCL, TGNPDCL యాప్ లు లేదా సంబంధిత వెబ్సైట్స్ లో చెల్లించడం సేఫ్ అని అధికారులు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!