Advertisement
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవ మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలుసు. అయితే ఇదే ఫ్యామిలీకి చెందిన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన కన్నుమూసిన విషయం మనందరికీ తెలుసు. నారా లోకేష్ మొదలు పెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు కు గురై నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులు చికిత్స అనంతరం మహాశివరాత్రి రోజు కన్నుమూశారు. దీంతో నందమూరి అభిమానులంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగారు.
Advertisement
also read: ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?
తారక రత్న లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి నిత్యం భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరు అవుతుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అప్పుడప్పుడు తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది. ఇక తారకరత్న చిన్న కర్మ రోజున తనను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అలేఖ్య. అంతేకాదు వాలెంటైన్స్ డే రోజున తారక రత్న రాసిన ప్రేమలేఖ, తనతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భావోద్వేగానికి గురవుతోంది.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 10.03. 2023
తాజాగా తారకరత్న కూతురు నిష్క రాసిన నోట్ కూడా అందరికీ కన్నీరు తెప్పిస్తోంది. అమ్మ నువ్వు చాలా ఆవేదనలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెప్తాను అంటూ నోట్ రాసింది. ఈ లేఖ ను అలేఖ్య రెడ్డి తన ఇన్స్టా స్టోరీ లో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ మరోసారి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజన్లు తల్లి కూతుర్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ నోట్ నిలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.
also read: