Advertisement
బాలకృష్ణ-కోదండరామిరెడ్డిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చి అంచనాలను అందుకోలేకపోయిన చిత్రం ‘ధర్మక్షేత్రం’. 1992 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ఈ మూవీ 2022 ఫిబ్రవరి 14 నాటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం.
Advertisement
కరెప్టెడ్ పొలిటిషన్స్ కొందరు తమ స్వార్ధ రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం కాలేజ్ స్టూడెంట్స్ ని కులం పేరుతో రెచ్చగొట్టి, వాళ్ళని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుసుకొని, ఒక నిజాయితీ గల న్యాయవాది ఆ పరిస్థితులను మార్చడానికి ధర్మాంగా చేసిన పోరాటమే ధర్మక్షేత్రం. బెనర్జీ అనే లాయర్ పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దివ్యభారతితో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ‘మాస్ట్రో’ ఇళయరాజా కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే చాట్ బస్టర్గా నిలిచాయి.
Advertisement
‘ఎన్నో రాత్రులు వస్తాయి గానీ, రాదీ వెన్నెలమ్మా’ పాట అయితే ఎవర్ గ్రీన్, 30 సంవత్సరాల తర్వాత బాలయ్య అన్న కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాలో ఈ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ధర్మక్షేత్రంలోని పాటను తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ గౌతమి హీరో హీరోయిన్ గా నటించిన ‘ధర్మధురై’ నుండి తీసుకున్నారు. దానికి ఇళయరాజానే సంగీత దర్శకుడు. “మాసి మాసమ్ మాలాన పొన్ను” అనే గీతం ఆధారంగా తెలుగులో కంపోజ్ చేశారు. సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, టీం మంచి ప్రయత్నం చేశారంటూ అభినందనలు అందుకుంది.
Read Also : రంజితమే పాటలో “రష్మిక” కి మించి అదరగొట్టిన ఈ క్యూట్ భామను గుర్తుపట్టారా ?