Advertisement
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న ఈ నటులు ఒకప్పుడు విలన్ పాత్రల ద్వారా ముందుగా పేరు తెచ్చుకొని తర్వాత హీరోగా అరంగేట్రం చేశారు. అలాంటి నటులు టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఉన్నారు.. వీరిలో ముఖ్యంగా టాలీవుడ్ లో ముందుగా విలన్ పాత్రలు చేసి తర్వాత హీరోగా మెప్పించిన వారు ఎవరో ఓ సారి చూద్దాం..!
Advertisement
Also Read: “కృష్ణా నుంచి రామ్ చరణ్” వరకు అల్లూరి పాత్రలో నటించిన హీరోలు ఎవరంటే..?
మెగాస్టార్ చిరంజీవి :
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హోదా లో కొనసాగుతున్న చిరంజీవి, మొనగాడు, ఇది కథ కాదు, వంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారట. విలన్ పాత్రలో ఆయన చేసే యాక్టింగ్ చూసి హీరోగా అయితే బాగా సెట్ అవుతాడని భావించి హీరో ఛాన్స్ ఇస్తే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మారాడు.
మోహన్ బాబు :
తెలుగు ఇండస్ట్రీ లో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని పిలుస్తారు. ముందుగా ఈ హీరో కూడా విలన్ పాత్రతో ఇండస్ట్రీలో మెప్పించి తర్వాత హీరోగా రాణించి, తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు.
Advertisement
గోపీచంద్ :
మొదటిగా తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్, ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో, జయం మూవీ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత యజ్ఞం సినిమ తో హీరోగా మంచి హోదా ను సంపాదించుకున్నాడు.
రాజశేఖర్ :
తెలుగు ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు. ముందుగా ఆయన తలంబ్రాలు సినిమా లో విలన్ పాత్రలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన పాత్రకు నంది అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీని తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి విజయవంతమయ్యాడు.
జేడీ.చక్రవర్తి :
జేడీ చక్రవర్తి కూడా తన కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా మరియు విలన్ గా సినిమాలు చేస్తున్నారు.
Also read: హిట్ అయిన సినిమాల్లో మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీళ్లే!