Advertisement
గురువారం ములుగులో మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. శంకుస్థాపన పూర్తి అయ్యాక సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాను కానీ, ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి సీఎం లు మాత్రం ఎక్కడా లేరన్నారు. అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో జరగని పనులన్నీ పదేళ్ళల్లోనే ఎలా అవుతాయని.. కొంత ఓపిక పట్టాలని అన్నారు. గిరిజన ప్రజలతో పాటు.. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలను ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యడానికి కారణం ఏమిటి?
Advertisement
అయితే.. కాంగ్రెస్ అప్పట్లో చేసిన చట్టాల వల్లనే ఈ పంపిణి ఇంత ఆలస్యం అయ్యిందని అంటున్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాల పంపిణి చెయ్యడానికి ప్రయత్నిస్తామని అన్నారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం అని అన్నారు. ఇక గృహలక్ష్మి, దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో వివక్ష కనిపిస్తోంది అంటూ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
దీనితో స్పందించిన సత్యవతి గతంలో లాగే సీతక్క ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?