Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్, వ్యూహాలు రచించడంలో దిట్ట! తన ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్ధులను చిత్తు చేసే గులాబీ బాస్, మునుగోడు విషయంలోనూ ఓ క్లారిటీ తోనే పావులు కదిపారట! రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పరిణామాలను పక్కాగా అంచనా వేసిన ఆయన, అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో అనుసరించాల్సిన పద్ధతులు, ప్రత్యర్థి బలబలాల విషయంలోనూ ఓ క్లారిటీతో కార్యాచరణను రూపొందించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఓ వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారని, తిరిగి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఇప్పుడు ఈ వ్యవహారం, ఇటు టిఆర్ఎస్, అటు బిజెపి లోను, దుమారం రేపుతోంది. ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారని, ఆయన సొంత గూటికి వెళ్ళవచ్చని ప్రముఖ దినపత్రిక దక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, రాష్ట్రంలో బిజెపిని ఎదగనీయవద్దని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, అందుకోసం గర్ వాపసిపై దృష్టి సారించారట. ఈ క్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులకు గాలం వేస్తున్న బిజెపికి, అదే ఆపరేషన్ ఆకార్ష్ తో కోలుకోలేని దెబ్బ కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
Advertisement
తమ పార్టీ నుంచి బిజెపిలో చేరిన కొందరు నేతలను, ఇప్పటికే తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే, వచ్చే ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని సీఎం కేసీఆర్ ఆఫర్ చేశారట. అయితే, దీనిపై క్లారిటీ రావాలంటే, ఈటల మీడియా ముందుకే రావాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
READ ALSO : కృష్ణకు 2500 అభిమాన సంఘాలు.. చిరంజీవి ప్రెసిడెంట్‌గా కృష్ణకి ఓ అభిమాన సంఘం