Advertisement
సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
Advertisement
ఇవి కూడా చదవండి : అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
#1 జల్సా:
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. భారీ హైపుతో 2008లో రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ క్రేజ్, సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
#2 సరైనోడు:
అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016 సమ్మర్ కానుకగా విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడం, మాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ ఫుల్ మూవీ గా నిలబడింది.
#3 జనతా గ్యారేజ్:
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2016 లోనే విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
Advertisement
#4 జై సింహా:
బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా విడుదలై, మొదటి రోజు ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.
#5 సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2020 లో విడుదలై నెగెటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
#6 పుష్ప ది రైజ్:
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ అనిపించుకుంది.
#7 బంగార్రాజు:
నాగార్జున – నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది.
#8 సర్కారు వారి పాట:
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ గా నిలిచింది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?