Advertisement
సిబిఎన్ అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి గా ఉన్న నారా లోకేష్ ఈ శుక్రవారం నుంచి పాదయాత్రని ప్రారంభించాల్సి ఉంది. అయితే.. అంతలోపలే రాజమండ్రికి రావాలి అంటూ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సూచన చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు లోకేష్ అరెస్ట్ కి అన్నీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకేష్ ను అరెస్ట్ చేస్తే.. ఆయన భార్య నారా బ్రాహ్మణి పాదయాత్ర ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
Advertisement
దీనితో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే టీడీపీ సానుభూతిపరుల శాతం పెరిగింది. ఇక నారా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగితే మహిళా సానుభూతిపరుల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. నారా బ్రాహ్మణికి కూడా ఆమె కుటుంబ సభ్యులు పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. ఇటు నారా, అటు నందమూరి వారసురాలిగా ఆమె రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని. ప్రజల నుంచి మరింత సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
Advertisement
మరోవైపు లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేయడం మంచిదని కొందరు భావిస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ దాకా ఎదురు చూడడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. అనుకున్న సమయానికి లోకేష్ యాత్రని ప్రారంభించలేకపోతే.. నారా బ్రాహ్మణి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే.. ఈ విషయం మాత్రం అధికార వర్గాల్లో గుబులు రేపుతోంది.
మరిన్ని..
మొదటి సారి CBN అరెస్ట్ పై స్పందించిన రేవంత్ ! KTR కు ఇచ్చిన కౌంటర్ మాములుగా లేదుగా !
స్కంద సినిమాకు అదే మైనస్ అయ్యిందా? లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునేదా?
స్కంద మూవీ లో సీఎం జగన్ ను టార్గెట్ చేసారా? ఈ పొలిటికల్ డైలాగ్స్ ఏంటి బోయపాటి