Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సిబిఎన్ అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది అన్న విషయంలో కూడా లెక్కలు మారాయి.
Advertisement
సిబిఎన్ ను బయటకు తీసుకొచ్చే పనిలో టీడీపీ పడిపోతే.. వైసీపీ మాత్రం నడిరోడ్లపై ప్రచారం చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. సిబిఎన్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతోంది.
మరో వైపు టీడీపీ నాయకుడు అరెస్ట్ అవ్వడంతో టీడీపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ కక్ష సాధింపు కోసమే ఇలా చేస్తోందని పలువురు టీడీపీ నేతలు వైసీపీ పై కామెంట్స్ చేస్తున్నారు.
మరో వైపు వైసీపీ నేతలు కూడా మాకు ఏమి సంబంధం ఉందని.. చంద్రబాబు నాయుడు తప్పు చేసాడు కాబట్టే అరెస్ట్ అయ్యాడని చెబుతున్నారు. తాజాగా ఈ విషయమై మాజీ ఎంపీ అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
చంద్రబాబు ఏమి తప్పు చేసారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేక స్కాం అని అన్నారు. ఎపి ప్రభుత్వంతో అంతర్జాతీయ కంపెనీ సీమెన్స్ టై అప్ అయ్యిందని అన్నారు. ఈ కంపెనీ మాత్రం తమకు ఏమీ తెలియదని చెబుతోంది.
మరో వైపు జీఎస్టీ విజిలెన్స్ పుణె ఈ స్కాం ను పట్టుకున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్ ఎలా మాయం అయ్యాయి? చంద్రబాబు నాయుడుని బుక్ చేయడానికే, ఆయన హయాం లోని ఫైల్స్ ని మాయం చేశారా? అంటూ ప్రశ్నించారు.
అవినీతి విషయంలో మిగతా వారి కంటే చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారని.. టీడీపీ పార్టీ నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి డబ్బులు వెళ్లలేదని చెబుతున్నారు. జగన్, మోడీ కలిసే ఈ పని చేస్తున్నారని.. చంద్రబాబుపై నేరం ప్రూవ్ చేయలేరని అంటున్నారు.
కనీసం జైల్లో బెటర్ సౌకర్యాలు ఇవ్వాలనీ.. ఏసీ పెట్టించడం కుదరకపోతే.. ఆసుపత్రికైనా తరలించాలని అంటున్నారు.
మరిన్ని..
“రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు ఈ పని చేసి ఉంటె బాగుండేది ఏమో కదా..?
గుడికి వెళ్లేముందు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?
Spandana APస్పందన యాప్ అంటే ఏమిటి? దీని వలన ప్రజలకు కలిగే లాభాలు ఏమిటి?