Advertisement
Extra: Ordinary Man Movie Review : నితిన్ నటించిన ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాని వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటించగా రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్ష వర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, పవిత్ర లోకేష్, హరి తేజ, జగదీష్, హైపర్ ఆది మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చారు.
Advertisement
Popular Post: Extra – Ordinary Man Movie Cast, Crew, Heroine Details
ఈ చిత్రానికి ఆర్థర్ ఎ. విల్సన్, జె.యువరాజ్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొద్ది కాలంగా సరైన హిట్ కొరకు ఎదురు చూస్తున్న నితిన్ కి ఈ సినిమా ద్వారా లభిస్తుందా లేదా అని చూడాలి ! రేస్ గుర్రం, కిక్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి స్టార్ సినిమాలకి కథని అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. రేస్ గుర్రం, కిక్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి స్టార్ సినిమాలకి కథని అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. రావు రమేష్ నితిన్ తండ్రిగా నటించారు. ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ సెన్సార్ ద్వారా లభించింది.
ఈ చిత్రానికి సెకండ్ హాఫ్ కథ టర్న్ తీసుకుంటుంది. రాజశేఖర్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మళ్లీ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. నితిన్, రాజశేఖర్ పాత్రలకు మంచి మార్కులు పడతాయట. ఈ చిత్రం ఫస్టాప్ కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ ఈ సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా నితిన్ ఖాతాలో మరో హిట్ పడిందనే చెప్పవచ్చు.
Advertisement
చిత్రం : ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్
నటీనటులు : నితిన్, శ్రీలీల, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు
దర్శకుడు: వక్కంతం వంశీ
నిర్మాత : శ్రేష్ఠ్ మూవీస్
మ్యూజిక్: హారిస్ జయరాజ్
విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023
Extra: Ordinary Man Movie: కథ మరియు వివరణ:
నితిన్ జూనియర్ ఆర్టిస్ట్. హీరో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. కుటుంబంలో అందరూ ప్రోత్సహిస్తూ ఉంటే తండ్రి మాత్రం కామెడీ చేస్తాడు. నితిన్ వీటిని పెద్దగా పట్టించుకోడు. నితిన్ లైఫ్ లోకి లిఖిత (శ్రీలీల) వస్తుంది. హీరో అయిన నితిన్ కి ఒక ఊరి సమస్యల గురించి తెలుస్తుంది. హీరో ఏం చేశాడు…? ఆ ఊరికి ఉన్న సమస్యలు ఏంటి…? అసలు రాజశేఖర్ ఎందుకు వచ్చారు…? సమస్యలని నితిన్ సాల్వ్ చేశాడా..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. కథ సాధారణంగా వుంది. కానీ కామెడీ తో మూవీ ని కొత్తగా చూపించారు. ఈ సినిమాలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న జోక్స్ ని బాగా వాడారు. ఈ మూవీ లో నితిన్ ని కొత్తగా చూపించారు. సుదేవ్ నాయర్ విలన్ గా బాగా చేసాడు. అతిధి పాత్రలో నటించిన రాజశేఖర్ కూడా అలరించారు. హారిస్ జయరాజ్ పాటలు ఒకే ఒకేగానే వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పరవాలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే వుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్ గా వుంది.
ప్లస్ పాయింట్స్ :
నితిన్ యాక్టింగ్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
పాటలు షూట్ చేసిన విధానం
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
రొటీన్ కథ
పెద్దగా వర్క్ అవుట్ అవ్వని కామెడీ సీన్స్
రేటింగ్ : 2.5/5
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!