Advertisement
తెలంగాణలో సంచలనంగా మారిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి స్వామి, నందకుమార్ లు మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీక్ అయింది.
Advertisement
ఈ ఆడియో కాల్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తమ మీద కెసిఆర్ నిఘా పెట్టారని, మనం కలవడానికి హైదరాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పగా, నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాదుకు వస్తానని, ఆరోజు కూర్చోని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామంటూ రామచంద్ర భారతి స్వామీజీ చెప్పినట్లు ఆడియో కాల్ లో ఉంది. ఇది ఇలా ఉండగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.టిఆర్ఎస్ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఈ మేరకు రోహిత్ రెడ్డికి 4+4 గన్ మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా, ఆ సంఖ్య ను 4+4కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేటి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. శుక్రవారం నిందితులతో రోహిత్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్స్ లీకై టీ పాలిటిక్స్ లో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఎవరి నుంచి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను పెంచినట్లు చెబుతున్నారు.
Read also : చంద్రముఖి అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ?