Advertisement
అది ఉత్తరప్రదేశ్ బరేలి పరిధిలో కందర పూర్ గ్రామం ఇక్కడే రోహిత్ కుమార్ (27), ఆర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ళ కిందట వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఈ భార్యభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోని ఆర్తి భర్తతో ఉన్న సుఖం చాలదన్నట్లుగా ఫేస్ బుక్ లో అనూజ్ పటేల్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం రానురాను వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది.ఇక ఇంకేముంది, ఆర్తి తాళి కట్టిన భర్త కన్నా పియుడితో ఉండేందుకు ఇష్టపడింది. రాను రాను ఈ అందాల సుందరికి భర్త కన్న ప్రియుడే ఎక్కువ అయ్యాడు. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే భర్తను చంపడం. ఆర్తి ఇదే విషయాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే తన ప్రియుడికి వివరించింది.ప్రియురాలి మాటలు విన్న ప్రియుడు అనూజ్ పటేల్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఇక ఇద్దరు అనుకున్నట్లుగానే రోహిత్ కుమార్ హత్యకు ప్లాన్ వేశారు.
Advertisement
Advertisement
పక్కా ప్లాన్ తో అడుగులు వేసిన ఆర్తి, అనూజ్ పటేల్ స్నేహితులతో కలిసి శుక్రవారం రోహిత్ కుమార్ ను దారుణంగా హత్య చేశారు.ఈ విషయం తెలుసుకున్న రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆర్తిని నిలదీశారు. ఈ విషయంలో తనకేం సంబంధం లేదన్నట్లుగా ఆర్తి నటించే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకో ఆర్తి మీద రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్తిని ప్రశ్నించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆర్తి ఆ తర్వాత అసలు నిజాలు వెళ్ళగక్కింది. నేరం రుజువు కావడంతో పోలీసులు ఆర్తితో పాటు ఆమె ప్రియుడు అనూజ్ పటేల్ అతని స్నేహితులను అరెస్టు చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కళకళంగా మారుతుంది.
READ ALSO : ఈ 15 మంది నటీనటులను మనం దాదాపు ప్రతి సినిమాలోని చూశాం.. కానీ వీరి పేర్లు మీకు తెలుసా..?