Advertisement
యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్లకు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు స్వయం ప్రకటిత శాక్రిఫైజింగ్ స్టార్ సునీషిత్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. సెలబ్రిటీలతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఫలానా హీరో తన సినిమాని లాక్కున్నాడని, తాను రిజెక్ట్ చేసిన సినిమాలలో స్టార్ హీరోలు నటించారని చాలా సందర్భాలలో సునిషిత్ చెప్పుకొచ్చారు. అయితే అతని మానసిక స్థితి బాగోలేదని భావించిన చాలామంది అతడు ఏం మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈ మధ్యకాలంలో అతను హద్దులు దాటి కామెంట్లు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మెగా ఫ్యాన్స్ అతనిని చితకబాదారు.
Advertisement
Read also: ALEKYA REDDY: భర్త కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైన అలేఖ్య రెడ్డి.. !
ఇంతకీ అతను చేసిన కామెంట్స్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం సున్నిషిత్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉపాసన కొణిదెల తన క్లోజ్ ఫ్రెండ్ అని, ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లానని పేర్కొన్నాడు. ఉపాసన దగ్గర ఆడి ఎలక్ట్రిక్ వాహనం ఉందని.. ఒకసారి తాను, ఉపాసన గోవా కి వెళ్లి వచ్చామని కామెంట్ చేశాడు. చిరంజీవి కూతురు సుష్మిత తో లాంగ్ డ్రైవ్ కి వెళ్లానని అన్నాడు. అంతేకాకుండా ఒకసారి ఉపాసనతో చాట్ చేస్తుంటే రామ్ చరణ్ చాట్ చేయమని, ప్రేమలో పడేయమని ఫ్రెండ్లీగా చెప్పాడని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు. సునిషిత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆమెను కించపరిచేలా ఉండటంతో మెగా అభిమానులకు, ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు హర్ట్ అయ్యారు.
Advertisement
ఇంకేముంది అతను ఎప్పుడు దొరుకుతాడా..? అని ఎదురు చూడసాగారు. అనుకోకుండా చరణ్ అభిమానులకు సదరు శాక్రిఫైజింగ్ స్టార్ దొరకగానే చితకబాదేశారు. మా వదినని తప్పుడు మాటలు అంటావా..? అంటూ కుల్లబొడిచారు. అంతటితో ఆగకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ తనని కొట్టారని, ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని, తప్పు చేశానని, క్షమించాలని అతనితో మీడియా ముందే చెప్పించారు. దీంతో ఇకముందు సునిషిత్ ఇలాంటివి రిపీట్ చేస్తే మాత్రం రాబోయే రోజులలో అతనికి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
మరిన్ని ముఖ్యమైన అంశాలు !
- ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకోసం ఎన్ని కథలను మార్చారో తెలుసా ?
- పెళ్లిరోజే ఎగ్జామ్.. నవ వధువు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!
1M+ views 😯 https://t.co/ZuG6AC8jV9
— KARTHIK PSPK™ (@Karthik4PSPK) May 14, 2023