Advertisement
నటి మీనా నిన్నటి తరం హీరోయిన్స్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా క్యారెక్టర్ నచ్చితే చాలు కచ్చితంగా ఆమె సినిమా చేసేవారు. 1982 చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా అప్పటి నుంచి చాలా లాంగ్వేజ్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె దాదాపు 45 సినిమాల వరకు చేసింది. మీనా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్న విద్యాసాగర్ ను పెళ్లాడింది. అంతే కాదు పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతలోనే మీనాకు ఒక కూతురు పుట్టింది.
Advertisement
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?
అయితే ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పుడు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు కాగా, రెండో వివాహం చేసుకోమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారట.
Advertisement
ఆడపిల్లకు మగతోడు అవసరం. కూతురు భవిష్యత్తు బాగుండాలన్న నీకు భర్త ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారట. మీనాకు మాత్రం రెండో వివాహం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదట. అయితే కుటుంబ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట. దీంతో మీనా ఫ్యామిలీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారనే మాట వినిపిస్తోంది. సదరు వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ అట. చాలా కాలంగా మీనా కుటుంబంతో అనుబంధం ఉందట. మీనా కూతురు ఆయన్ని అంకుల్ అని పిలుస్తుందట. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ ప్రచారంపై మీనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?