Advertisement
Family Star Review : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ స్టార్ సినిమాను నిర్మించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా కి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబో వచ్చిన మూవీ కనుక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వున్నాయి.
Advertisement
సినిమా: ఫామిలీ స్టార్
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు.
నిర్మాత: దిల్ రాజు
సంగీతం: గోపీ సుందర్
దర్శకత్వం: పరశురామ్
రిలీజ్ డేట్: 05-04-2024
కథ మరియు వివరణ:
స్టోరీ వస్తే.. విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిలా కనపడ్డాడు. ఇందులో విజయ్ చాలా సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాడు. తన ఫ్యామిలీ లో ఉన్న అన్ని సమస్యల తో నలిగిపోతూ ఉంటాడు. హీరోయిన్ మృణల్ కి తనకు మధ్య పెళ్లి తర్వాత విభేదాలు రావడం వంటివి జరుగుతాయి. కలిసి వుంటారా లేదంటే విడిపోతారా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ ఎలా ఉంది అనేది చూస్తే.. పరుశురాం పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు. పూరి జగన్నాథ్ మూవీస్ లో వుండే ఫ్లేవర్ ని ఈ సినిమా లో చూపించారు.
Advertisement
అలానే ఈ మూవీ సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ని ఇచ్చారు. విజయ్, మృణాల మధ్య కొన్ని సీన్లు అయితే సూపర్బ్ గా వున్నాయి. అలానే ఈ మూవీ కి పరుశురాం రాసుకున్న సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా అకట్టేసుకున్నాయి. సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా వుంది. విజయ్ బాడి లాంగ్వేజ్ కి తగ్గట్టు సినిమాలో పాత్ర వుంది. గోపి సుందర్ చేత ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ని ఇచ్చారు. విజయ్, మృణాల్ నటన బావుంది.
ప్లస్ పాయింట్స్
స్టోరీ
డైరెక్షన్
విజయ్, మృణల్ ఠాకూర్ నటన
ఎమోషనల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
గోపి సుందర్ మ్యూజిక్
స్లో గా నడిచే సీన్స్
రేటింగ్: 2.75/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!