Advertisement
చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పైగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరంజీవి. చిరంజీవి భోళా శంకర్ సినిమా చూసి పెద్ద తప్పు చేసినట్లు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. చిరంజీవి కి ఒక ఫ్యాన్ లెటర్ రాశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. క్యారవ్యాన్ ఉన్నా కూడా అందులోకి వెళ్లి రెస్ట్ తీసుకోకుండా స్పాట్లోనే ఉంటూ మీ షాట్లకి కాకుండా కౌంటర్ షాట్లకు కూడా రియాక్షన్ ఇస్తూ ఎప్పుడూ తోటి ఆర్టిస్టులను ఇన్స్పైర్ చేస్తారు.
Advertisement
అలానే టేక్ కి వెళ్లే ముందే రిహార్సల్ చేస్తూ అందర్నీ ఇన్వాల్వ్ చేస్తారు. ఎప్పుడో జాతర సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ టాలెంట్ ని గుర్తు పెట్టుకుని 15 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కి నటన నేర్పమని బాధ్యత అప్పగిస్తే అతను టాలీవుడ్ టాప్ హీరోలకి నట గురువు అయ్యారు. మాస్టర్ టైంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథని గుర్తు పెట్టుకొని పదకొండేళ్ల తర్వాత మగధీర సినిమాని చేయించి రామ్ చరణ్ కి హిట్ వచ్చేలా చేశారు.
Advertisement
ఇండియాలో ఒక కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటే ప్రతి హీరో ఎలా నటించాలి ఏం చేయాలి అనేది మీ జర్నీ చూసి తెలుసుకోవచ్చు అంటూ రాసారు. అటువంటి మీరు ఎందుకు గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్ట్రైట్ సినిమాలో వచ్చే కిక్కు రీమేక్ సినిమాల్లో రావు. అభిమానిగా మా బాధ చెప్పుకోవాలని ఇది రాస్తున్నా అంటూ అభిమాని ఈ లెటర్ ని రాశారు.
ఫైనల్ గా మనకెందుకు సార్ రీమేక్స్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. భోళా లో మీ ఎనర్జీని చూస్తే గ్యాంగ్ లీడర్ చిరంజీవి గుర్తొచ్చారు అయితే ఇంత పొటెన్షియాలిటీ ఉండి కూడా ఏంటి ఇలాంటి సినిమా చేశారు అని ప్రతి అభిమాని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా అనవసరంగా ఈ సినిమా చేశానని బాధపడుతూ ఉంటారు. రీఛార్జ్ అయ్యి ఇంకో వన్ ఇయర్ లోపు రికార్డ్ సినిమా మీరు ఇస్తారు అని కూడా అభిమాని రాశారు.
Also read: