Advertisement
టీమిండియాలో గత కొన్ని రోజులుగా స్థానం దక్కక సతమతమౌవుతున్న ప్లేయర్ సంజు సామ్సన్. అయితే, సంజు సామ్సన్ కు టీమిండియాలో ఘోర అన్యాయమే జరుగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఉన్న సంగతి, తెలిసిందే. అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ పూర్తికాగానే బంగ్లాదేశ్ కు పయనం కానుంది టీమిండియా. బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది.
Advertisement
ఇక టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం సంజు సామ్సన్ గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిభకు ఏ లోటు లేని ఈ ప్లేయర్ టీమిండియా మేనేజ్మెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు బలవుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఇతడికి టి20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సంజు సాంసన్ ఆకట్టుకున్నాడు. 36 పరుగులు చేశారు. ఇక ఇదే మ్యాస్ లో రిషబ్ పంత్ కేవలం 15 పరుగులకే వెనుతిరిగాడు. కానీ, కివీస్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సంజు కు స్థానం ఇవ్వకుండా హుడా కు అవకాశం ఇచ్చి… సంజూకు అన్యాయం చేశారు. ఇక సంజు సామ్సన్ కు వరుసగా ఒక పది మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.
Advertisement
అవసరమైతే వేరే ప్లేయర్లను డ్రాప్ చేసి సంజు సామ్సన్ కు అవకాశం ఇవ్వాలని రవి శాస్త్రి బీసీసీఐకి హితవు పలికాడు. కానీ, బీసీసీఐ మాత్రం మరోసారి సంజు సామ్సన్ కు అన్యాయం చేసింది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు సామ్సన్ ను ఎంపిక చేయలేదు. ఫామ్ లో లేని పంత్ కు చోటు ఇచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు సామ్సన్ ను మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా కివిస్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత సామ్సన్ మరోసారి ఇంటి వద్ద ఉండాల్సిందే. ఒక పక్క పంత్ వరుసగా విఫలం అవుతున్నా అతడికి మూడు ఫార్మాట్లలోను అవకాశం ఇస్తున్నారు. సామ్సన్ విషయంలో మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆడని పంతుకు అవకాశాలు, ఫామ్ లో ఉన్న సామ్సన్ పై వేటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దక్షిణ భారతీయులకు బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఆగ్రహిస్తున్నారు.
read also : పంత్ ఇకనైనా కొవ్వు తగ్గించుకో.. ధోనిని చూసి నేర్చుకో !