Advertisement
పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే బోలెడంత బజ్ పెరిగింది.. సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. వాళ్ళ ఎదురుచూపులకు తెరదించుతూ ఎన్టీఆర్ బర్త్డే కి ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి దేవరా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. నల్లని దుస్తుల్లో పొడవాటి కత్తి పట్టుకుని పడవలో ప్రయాణిస్తూ స్టైల్ గా నిల్చొని ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ స్టోరీ లైన్ మాత్రం ఎన్టీఆర్ అభిమానులను కలవర పరుస్తోందట. భయం అనేది తెలియకుండా బ్రతుకుతున్న మృగాలకు అతన్ని చూస్తే వణుకు పుడుతుంది అనే స్టోరీ లైన్ ఉన్నట్టు కొరటాల శివ ముహూర్తం రోజే తెలియజేశారు.
Advertisement
దీంతో పూర్తి స్టోరీ లైన్ సోషల్ మీడియాలో లీక్ అయిపోయినది. వివరాల్లోకి వెళ్తే ..ఇందులో ఎన్టీఆర్ సముద్ర తీరంలో స్మగ్లర్ గా పని చేస్తూ ఉంటారట. అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా ఇదే వ్యాపారం చేస్తారట. ఇద్దరి మధ్య మొదటి నుంచి గొడవలే ఉంటాయట. ఒక సమయంలో సముద్రం నడి ఒట్టిన స్మగ్లింగ్ గూడ్స్ పై ప్రయాణిస్తున్న ఎన్టీఆర్ మరియు అతని వర్గంపై సైఫ్ అలీ ఖాన్ దాడి చేసి అందరిని చంపేస్తారు. దీంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేవర కొడుకు అంటే మరో ఎన్టీఆర్ ఆ వ్యాపారం లోకి అడుగు పెడతాడు.
Advertisement
చివరికి ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది స్టోరీ లైన్. అయితే మనం ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఈ స్టోరీలు చూసాం. ఎలాంటి డిఫరెంట్ లేకుండా రొటీన్ స్టోరీ తో మళ్ళీ సాహసం చేస్తున్నారని అనిపిస్తోంది. అంతేకాకుండా కొరటాల శివ టేకింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా సినిమా తీయకపోతే ఆచార్య లా డిజాస్టర్ అయ్యే అవకాశం లేకపోలేదని కొంతమంది సినిమా నిపుణులు అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు కూడా కొరటాల శివ పై కాస్త అనుమానం గానే ఉన్నట్టు తెలుస్తోంది.
మరి కొన్ని ముఖ్య వార్తలు: