Advertisement
ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటున్నాయి. మారిన పరిస్థితులు, అవసరాలు కూడా ఈ గొడవలకు కొంత కారణం అవుతున్నాయి. అయితే.. ఈ గొడవలన్నీ విడాకులకు దారి తీస్తున్నాయి. విడాకుల తీసుకున్నాక అమ్మాయిలు తిరిగి మామూలు లైఫ్ గడిపాడానికే అలవాటు పడిపోతున్నారు. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పటి తల్లి తండ్రులు కూతుళ్లను అర్ధం చేసుకుని వారికి ఓ మార్గం చూపించడానికి కూడా సిద్ధంగానే ఉంటున్నారు.
Advertisement
తాజాగా ఓ తండ్రి తన కూతురుకి విడాకులు వచ్చాక ఇంటికి ఊరేగింపుగా తీసుకొచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్ లోని రాంచిలో చోటు చేసుకుంది. ఈ నెల పదిహేనవ తేదీ ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసారు. రాంచి నివాసి అయిన ప్రేమ్ గుప్త అనే వ్యక్తి తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే వివాహం అయిన కొన్ని రోజుల నుంచే సచిన్ నుంచి సాక్షికి వేధింపులు మొదలయ్యాయి.
Advertisement
సచిన్ కు అంతకుముందే వివాహం అయ్యిందన్న విషయం బయటకు వచ్చింది. అయినప్పటికీ మొదట్లో ఆ బంధాన్ని కొనసాగించాలనే సాక్షి నిర్ణయించుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వేధింపులు ఎక్కువ కావడంతో సాక్షి భరించలేకపోయింది. అందుకే ఈ వివాహానికి ముగింపు పలకాలని సాక్షి నిర్ణయించుకుంది. ఇదే విషయాన్నీ ఆమె తల్లితండ్రులకు చెప్పగా వారు కూడా ఆమె నిర్ణయానికి స్వాగతించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమెకు ఊరేగింపు ఏర్పాటు చేసి మరీ ఇంటికి తీసుకొచ్చాడు ఆమె తండ్రి. ఈ విషయం గురించి చెప్తూ కుమార్తెలు ఎంతో విలువైన వారు.. వాళ్ళు అత్తింట్లో ఇబ్బందులు పడుతూ ఉంటె వారికి అక్కున చేర్చుకుని మనమే ధైర్యం ఇవ్వాలి అంటూ పేర్కొన్నారు. అలాగే.. సచిన్ తో విడాకులు ఇప్పించడం కోసం న్యాయస్థానంలో కేసు వేయించారు.
మరిన్ని..
ప్రవల్లిక కేసులో అసలు జరిగింది ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన తల్లి, తమ్ముడు!
వ్యూహం సినిమాలో అచ్చం వై ఎస్ భారతిలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తన బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Kalonji Seeds In Telugu: కలోంజీ సీడ్స్ అంటే ఏమిటి? వీటి వలన కలిగే ఉపయోగాలు ఏమిటి?