Advertisement
Fathers Day Quotes 2023 Wishes, Images in Telugu: ఫాదర్స్ డే శుభాకాంక్షలు : మన తల్లిదండ్రులు దైవంతో సమానం. తల్లి మనకు జన్మని ఇస్తే.. తండ్రి ఆ జన్మకు మూల కారణం. మనం అంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి చలువే. తల్లితో పాటు సమానమైన ప్రేమను తండ్రి కూడా అందిస్తాడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే, తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. అందుకే మాతృదినోత్సవాన్ని జరుపుకునేంత స్థాయిలో పితృదినోత్సవాన్ని జరుపుకోరు.
Advertisement
Also Read: Happy birthday wishes, Quotes, Greetings, kavithalu in Telugu
Father’s Day Wall Papers
Father’s Day Wall Papers
చాలా వరకు సినిమాల్లో సైతం తల్లి సెంటిమెంట్ ఆధారం చేసుకునేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ తండ్రి సెంటిమెంట్ ఉన్నవి చాలా తక్కువగానే ఉంటాయి. సినిమాల్లో అయినా నిజజీవితంలో అయినా తల్లిదండ్రులు ఇద్దరూ సమానమే. తాను ఎన్నో బాధ్యతలను మోస్తూ.. ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ.. పిల్లలను పెంచి పెద్ద చేస్తాడు తండ్రి. ముఖ్యంగా తన కలలు, ఆశయాలు, ఆశలు అన్నింటిని వదిలుకొని తన పిల్లలే ప్రపంచంగా భావిస్తాడు. పిల్లలు తప్పటడుగులు వేసిన ప్రతీసారి సరిదిద్దే బాధ్యతను కూడా తానే మోస్తాడు. తాను ఏమి చేసినా.. ఎన్ని చేసినా ఇవేవి పిల్లలకు తెలియనివ్వడు. ఏది ఏమైనప్పటికీ మన జీవితాల్లో ఓ విలక్షణమైన పాత్రను పోషించే గొప్ప వ్యక్తి తండ్రి. ఈ నేపథ్యంలో ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రేమను చాటి చెప్పే కొన్ని ఫాదర్స్ డే కొటేషన్లను తెలుసుకుందాం.
Advertisement
Fathers Day 2023 Wishes, Images in Telugu: ఫాదర్స్ డే శుభాకాంక్షలు
- నాన్నే నాకు ఆదర్శం. నాన్నే నా మార్గదర్శి నాన్న బాటనే నాదారి. నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
- నాన్నా నువ్వే నా జీవితం అద్భుతమైన గిప్ట్. నీ ఆశీస్సులే నా ఈ జీవితం. నీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
- ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు ? మా నాన్న ఉండగా.. నీ కన్నా ఇన్ స్పిరేషన్ ఏముంటుంది నాన్న.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
- నాన్నా నా జీవితంలో ఎన్నో అద్బుతమైన క్షణాలున్నాయి. వాటన్నింటికీ కారణం అమ్మ, నువ్వే.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
- మనల్ని పెంచి పెద్ద చేసిన ప్రతీ తండ్రికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
- నాన్న మనకు సపోర్ట్ ఇస్తాడు. గైడ్ చేస్తాడు. మన బలం తను అవుతాడు. అందుకే నాన్నను ఎప్పటికీ ప్రేమిద్దాం.. హ్యాపీ ఫాదర్స్ డే.
- ఫాదర్స్ డే రోజు ప్రతీ తండ్రి కల నెరవేరాలి. విజయం వారి ముంగిట నిలవాలి. తండ్రుల ఆశీస్సులు మనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ పాదర్స్ డే.
Fathers Day 2023 Wishes
- నాన్న కేవలం మనకు ఇంటి పేరునే కాదు.. సమాజంలో మంచి పేరును కూడా ఇస్తాడు.
- మనం ఎక్కిన తొలి విమానం మన తండ్రి భుజాలే.
- మన జీవితంలో చాలా మంది స్ఫూర్తిదాతలు ఉండవచ్చు. కానీ ఆ జాబితాలో తొలిపేరు మాత్రం నాన్నదే.
- నాన్న దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటేందుకు ఉపయోగపడుతుంది.
- పిల్లలకు మొదటి గురువు స్నేహితుడు, మార్గదర్శి అన్ని నాన్ననే..
- నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కానీ అపజయం మాత్రం అస్సలు ఉండదు.
- మన జీవితంలో ఎప్పటికీ మరవకూడని వ్యక్తుల్లో నాన్న ఒకరు.
- తొలి జీతం అందుకున్న రోజున మనకన్న ఎక్కువగా ఆనందపడే వ్యక్తి నాన్ననే.
-
Father’s Day Whatsapp Status
Father’s Day Whatsapp Status
Father’s Day wishes in English