Advertisement
ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. పెద్దలు ఇంట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. పరువు కోసం కన్న కూతుర్ని దారుణంగా ఒక తండ్రి హత్య చేశాడు. దీంతో 20 ఏళ్ల కూతురు చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోలార్ గోల్డ్ ఫీల్స్డ్ లో బంగారు పేట లో కృష్ణమూర్తి ఉంటున్నారు. అతని కూతురు కీర్తి వేరే కులానికి చెందిన గంగాధర్ తో ప్రేమలో పడింది. కీర్తి తననే పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టింది.
Advertisement
తండ్రీ కూతుర్ల మధ్య ఈ విషయం లో తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. కూతుర్ని ఒప్పించలేక పోయాడు. తరచూ ఈ విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. ఓ రోజు గొడవపడి కూతుర్ని చంపేశాడు కృష్ణమూర్తి. గొడవ పడినప్పుడు గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కీర్తి గొంతు కోసి చంపేశాడు కృష్ణమూర్తి. ఆ తరవాత అతను ఆమె హత్య ని ఆత్మహత్యగా మార్చాలని మృతదేహాన్ని ఫ్యాన్ కి ఉరి వేశాడు.
Advertisement
కీర్తి ఆత్మహత్య గురించి పోలీసులకి తెలిసి అక్కడకి చేరుకున్నారు. ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు తెలుసుకున్నారు. అనుమానం వచ్చి కృష్ణ మూర్తిని విచారించారు. కీర్తి చనిపోయిన విషయం ప్రేమికుడు గంగాధర్ కి తెలిసి సమీపం లోని రైలు పట్టాల దగ్గరకెళ్ళి రైలు ముందు దూకేశాడు. దీనితో అక్కడికక్కడే చనిపోయాడు. భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 302 కింద కృష్ణ మూర్తి ని హత్య కేసు లో అరెస్ట్ చేశారు పోలీసులు.
Also read:
క్యారెట్ ని రోజు ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. ఎలాంటి రోగం దరిచేరదు..!
ఉప్మాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
బాలకృష్ణ నటించిన బైరవద్వీపం సినిమా అప్పట్లోనే అన్ని కలెక్షన్లను వసూలు చేసిందా ?