Advertisement
ఇంకొన్ని రోజుల్లో తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తోంది. పనులు చివరి దశలో ఉన్నాయి. ఓపెనింగ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు కేసీఆర్. జాతీయ నేతలకు ఆహ్వానం పంపి.. భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే.. శుక్రవారం ఉదయం తెలంగాణ సచివాలయంలో భారీగా మంటలు ఎగసిపడడం అందర్నీ షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా.. మీడియాలో రకరకాల కథనాలు వచ్చేశాయి.
Advertisement
సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదం జరిగిందని.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని.. ఇలా అనేక వార్తలు వచ్చాయి. భనవం కుడిపైపు, సచివాలయం ప్రధాన గుమ్మటం దగ్గర దట్టంగా పొగలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా స్పాట్ కు వెళ్లారు.
Advertisement
సీన్ కట్ చేస్తే.. అధికారులు ఇది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ అని చెప్పారు. సచివాలయ భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారని, అందులో భాగంగా మంటలు వచ్చాయన్నారు. సీఎం ఛాంబర్ ఉండే 5, 6 అంతస్తుల్లో ఈ డ్రిల్ జరిపినట్లు చెబుతున్నారు. అయితే.. అధికారుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మాక్ డ్రిల్ జరిపితే అంత పెద్ద ఎత్తున మంటలు ఎందుకు వస్తాయి.. అయినా.. తెల్లవారుజామున డ్రిల్ చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
ఇటు కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. నిజనిర్ధారణతో అన్నీ తేలుస్తామని హస్తం నేతలు బయలుదేరారు. అయితే.. గాంధీభవన్ బయటే వారిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ప్రభుత్వం ప్రమాదాన్ని డ్రిల్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు హస్తం నేతలు.