Advertisement
స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల లోపల బేబీ గ్రోత్ చాలా బాగుంటుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. మరి స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తప్పనిసరిగా పోలిక్ యాసిడ్, క్యాల్షియం, ప్రోటీన్,ఐరన్, ఒమేగా 3, పాటి యాసిడ్స్, చికెన్, చేపలు, వంటివి ఎక్కువగా తినాలి. దీనితో వీరు తగినంత మొత్తంలో ప్రోటీన్స్ పొందుతారు. ఐరన్, ప్రోటీన్ కణాలను తయారు చేయడంలో రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
Advertisement
మూడు నెలల వరకు ఈ ఆహారం తినాలి :
ముఖ్యంగా రెండవ నెలలో పెరుగు ఎక్కువగా తినలట. దీని ద్వారా కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా పొందుతారు. ఇది బిడ్డ యొక్క ఎముకల, కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సోయాబీన్స్ ప్రోటీన్, ఫైబర్,పోలిక్ యాసిడ్,ఐరన్ పొందుతారు.
Advertisement
గుడ్లు తినొచ్చా:
గర్భస్థ స్త్రీలు ప్రోటీన్ కోసం గుడ్డు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో కోలీన్ కూడా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి, చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా సాల్మన్ చేపలు బిడ్డ యొక్క కళ్ళు,మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆకుకూరలు తినడం వల్ల పోలేట్, కాల్షియం, విటమిన్ ఏ,విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా చిలకాడ దుంపలో బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ బాదం, వాల్ నట్స్, పిస్తాలు, జీడిపప్పు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు,ఫైబర్,మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి గర్భస్థ స్త్రీలు మొదటి మూడు నెలలు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిదని గైనకాలజిస్ట్లు అంటున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు: