Advertisement
చాలామంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్య ఉద్యోగం కోసం నాలుగేళ్ల క్రితం విదేశాలకు వెళ్లిన భారతి అనే యువతీ నాలుగేళ్ల పాటు అక్కడే ఉండిపోయింది. జూన్ 20న తిరిగి ఇంటికి ఆమె బయలుదేరింది అయితే ఇంటికి చేరకుండానే ఆమె చనిపోయింది. ఈ విషాద సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన మన్ ప్రీత్ కౌర్ నాలుగేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటోంది. చదువు పూర్తి కావడంతో జూన్ 24న న్యూఢిల్లీకి బయలుదేరింది.
Advertisement
విమానాశ్రయానికి ఆమె చేరుకుంది. విమానం కోసం ఎయిర్ పోర్ట్ లో వేచి ఉన్న సమయంలో అస్వస్థకు గురైంది. విమానం రాగానే అనారోగ్యంతోనే వెళ్లి విమానం ఎక్కి కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉండగానే కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. విమాన సిబ్బంది అత్యవసర సేవలు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె క్షయ వ్యాధితో మరణించి ఉండొచ్చని అందరు భావిస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న ఆమె స్నేహితుడు మృతదేహాన్ని దేశానికి తిరిగి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
Advertisement
Also read:
Also read:
ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందని అన్నాడు. ఆమె లేని లోటు తీరనిది అని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చెఫ్ కావాలని కోరుతుందని అతను గుర్తు చేశారు. అయితే నాలుగేళ్ల క్రిందటి వెళ్లిన కూతురు తిరిగి వస్తుందని కుటుంబం అంతా ఎదురు చూస్తోంది. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. దీంతో గుండె బద్దలైనట్లు అయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!