Advertisement
భారతదేశంలో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండకి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు పోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మేధావులు ప్రపంచ వ్యాప్తంగా మతాల గురించి గొడవలు జరిగే దేశాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని.. ఇది దేశానికి మంచిది కాదని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో చాలా రంగాల్లో భారతీయులే ప్రతిభవంతులుగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.
Advertisement
Advertisement
తప్పనిసరి అని కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ప్రేమ ఎవరి భయపడుతుందో చెప్పలేని పరిస్థితి క్రమంలో ఈ నిర్ణయం అనేక ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. ఈ విషయంలోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిచేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
రాజ్యాంగబద్ధంగా సాధ్యం అయితే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేసారు.