Advertisement
హీరో మెటీరియల్ కాకపోయినా టాలెంట్ తో సంబంధం లేకుండా, సినిమాపై ఉన్న ఆసక్తితో ఎంతోమంది నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆ కోవలోనే తన లక్ పరీక్షించుకోవడానికి ఓ బిజినెస్ మ్యాన్ హీరోగా గ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ది లెజెండ్ శరవనన్. దాదాపు రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ తో చిత్రం ‘ది లెజెండ్’ అనే సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేశారు.
Advertisement
ఇన్నాళ్లు వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 52 ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్ తో వెలుగులోకి వచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్టులో ఊర్వశి రౌటేలా కథానాయక. ఈ నేపథ్యంలో అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న ఒక్కటే ఇంతకీ ఎవరి ‘ది లెజెండ్’ హీరో? ఆయన గురించే ఈ కథనం.
శరవణ స్టోర్స్, తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్ టైల్స్ జువెలరీ స్టోర్స్ తోపాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు ఇలా శరవణ స్టోర్స్ లో దొరకని దంటు ఏమీ లేదు. ఈ రిటైల్ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవనన్ సెల్వ రత్నమ్ కుమారుడే అరుణ్ శరవనన్. అరుల్ శరవనన్ 1970 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి శరవనన్ సేల్వ రత్నమ్ వ్యాపారవేత్త. చదువు పూర్తయిన తర్వాత అరుల్ శరవనన్ వ్యాపార నిర్వహణ లోకి వచ్చేసారు. కొన్నాళ్లుగా దుస్తులు, ఫర్నిచర్, జువెలరీ సహా వివిధ వ్యాపారాలను చూసుకుంటున్నారు. వీటి విలువ వందల కోట్ల పైమాటే.
Advertisement
అరుల్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు. మోడల్ గాను రాణించారు. శరవణ స్టోర్స్ కు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. 2019లో అగ్ర కథానాయకులు తమన్నా, హన్సికలతో ఆయన రూపొందించిన ప్రచార చిత్రాలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉన్న వివిధ కారణాలతో అది నెరవేరలేదు. ప్రకటనల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావడంతో ఎలాగైనా నటుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో కోర్స్ కూడా పూర్తి చేశారు. ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ పతాకం పై చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. జె.డి.జెర్రీ దర్శకత్వం లో హ్యరిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్ర దర్శకులు జే.డి.జెర్రీ లు అజిత్ తో ‘ఉల్లాసం’ తీశారు.
మార్చి 3,2022 నా ఈ సినిమాకు ‘ది లెజెండ్’ అనే టైటిల్ ను ప్రకటించడంతోపాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో శరవనన్ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఇందులో కథానాయకగా నటించింది. శరవనన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయనకు సూర్య శ్రీ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017 జూన్ లో సోదరి వివాహానికి రూ 13 కోట్ల విలువైన దుస్తులు బహూకరించారు. అప్పట్లో చెన్నైలో ఈ వార్త సంచలనం అయింది. చిన్నప్పటినుంచి సినిమాలు, యాక్టింగ్ పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్ స్టైల్, బిజినెస్ వేరు. బిజినెస్ లో సక్సెస్ అయ్యా. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను. అని శరవనన్ అంటున్నారు.
READ ALSO : ఉత్తమ్ సింగ్, సూర్యనారాయణ టైటిల్, పోకిరిగా ఎలా మారింది? దాని వెనుకున్న స్టోరీ ఇదే.