Advertisement
ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి చేసుకునే ముందు జీవిత భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు ఉండాలి అలాంటి లక్షణాలు ఉండాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సరైన జీవిత భాగస్వామి వచ్చేవరకు పెళ్లికి ఎస్ చెప్పరు. చాలామంది ఈరోజుల్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. జీవిత భాగస్వామి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటున్నారు.
Advertisement
ఇదివరకు పెళ్లిళ్లని పెళ్లి సంబంధాలను బంధువులే తెచ్చి పెట్టేవారు కానీ ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వెతుక్కుంటున్నారు. అయితే ఈ మ్యాట్రిమోనీలో వచ్చే సంబంధాలను చూస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది.
ఈ అడ్వటైజ్మెంట్లని కనుక చూసారంటే కచ్చితంగా మీరు ఫుల్లుగా నవ్వుకుంటారు. ఏంటి ఇలా కూడా కాబోయే జీవిత భాగస్వామి కోసం రాస్తారా అని షాక్ అవుతారు కూడా. మరి ఇక నవ్వుని తెప్పించే మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్ ల గురించి చూద్దాం.
Advertisement
ఫేస్ బుక్ ఉపయోగించని తమిళ అమ్మాయి కావాలి. 32 ఏళ్ళు వయసుగల వరుడు కి బొద్దుగా ఉండే అమ్మాయి కావాలి. అలానే ఫేస్ బుక్ ని వాడకూడదు అని ఈ అడ్వర్టైజ్మెంట్ లో రాయడం జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వద్దు అంటూ ఇంకో అడ్వటైజ్మెంట్ లో ఉంది మొత్తం వివరాలు అన్నీ రాసి.. కిందన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే దయచేసి ఫోన్ చేయొద్దు అని రాసి ఉంచారు.
ఫెమినిస్ట్ లు అయితే వద్దు అంటూ ఇంకొక వ్యక్తి మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్ లో పెట్టాడు. అదే విధంగా ఇంకో దగ్గర అయితే అమ్మాయి మందు తాగకూడదు కావాలనుకుంటే జీన్స్ వేసుకోవచ్చు.
బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కచ్చితంగా మా కులం వాళ్ళని గౌరవించాలి అని రాసారు. ఇలా ఎన్నో ఫన్నీ యాడ్స్ మనకు కనపడుతుంటాయి.
Also read: