Advertisement
గంగవ్వ ఒక యూట్యూబ్ వీడియో చేసింది. వీడియోలో తన ఆస్తులు చిట్టా విప్పింది. గంగవ్వ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉన్న లాంబడి పల్లి అనే మారమూల గ్రామంలో ఉంటోంది. పాత పెంకుటింట్లో ఒంటరిగా ఉండేది. ఆమె చేష్టలు మాటలు భిన్నంగా ఉంటాయి. ఆమె మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ లో ఆమె వీడియోలని పెట్టింది వాటికి ఆదరణ లభించింది. గంగవ్వ సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. గంగవ్వకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అవకాశం వచ్చింది. పక్కా పల్లెటూరు వాతావరణం లో పెరిగిన గంగవ్వ నాలుగు గోడల మధ్య కృత్రిమ వాతావరణంలో ఉండలేకపోయింది.
Advertisement
ఎలిమినేట్ కాకుండానే హౌస్ నుంచి వచ్చేసింది. ఆమె అక్కడ ఎక్కువ వారాలు ఉండకపోయినా స్టార్ మా, నాగార్జున కలిసి ఆమెకి ఉండడానికి ఒక ఇల్లు నిర్మించారు. 22 లక్షలతో గంగవ్వ ఊర్లో ఇల్లు నిర్మించుకుంది. మూడు లక్షలతో ఆవులని కొని వాటి కోసం షెడ్డుని నిర్మించింది. ఊరిలోనే నాలుగు కుంటల పొలాన్ని గంగవ్వ కొంది. దాని విలువ తొమ్మిది లక్షలు. గంగవ్వకు ఇంకో చోట 80 లక్షలు విలువచేసే రెండున్నర ఎకరాల పొలం ఉందట.
Advertisement
Also read:
మూడు లక్షల రూపాయలతో ఒక కమర్షియల్ ఫ్లాట్ కొనుగోలు చేసింది. మరోచోట 15 కుంటల పొలం ఉందట. దాని విలువ7 నుంచి 8 లక్షలు ఉంటుందట. మొత్తంగా ఆమె ఆస్తులు విలువ 1.24 కోట్లు ఉంటుందని గంగవ్వ చెప్పింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఇచ్చారట. మనవరాలకి 2.5 లక్షలు ఇచ్చిందట. యాభై ఆవుల్ని కొనుగోలు చేసి పాలు అమ్ముకుంటూ జీవించాలనేది ఆమె కల.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!