Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ అంటే ఎంతటి ఆదరాభిమానాలు ఉంటాయో అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే వేరే లెవెల్.. అన్న చిరంజీవిని ఎవరు ఏమన్నా తమ్ముడు నాగబాబు తక్షణమే స్పందించి వారికి సరైన కౌంటర్ ఇస్తూ ఉంటారు.. అయితే తాజాగా గరికపాటి అలాయ్ బలాయ్ ప్రోగ్రాంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సమయంలో చిరంజీవినీ చూసిన చాలా మంది ఫోటోలు దిగడం కోసం ఎగబడ్డారు. ఈ తరుణంలోనే గరికపాటి గారు స్పందించి మీరు ఫోటోలు దిగడం ఆపేస్తే నేను ప్రసంగం ఇస్తానని గట్టిగా అరిచాడు లేదంటే బయటకు వెళ్తానని అన్నారు.
Advertisement
also read:యూట్యూబ్ స్టార్ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా..?
దీంతో ఆ కమిటీ సభ్యులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.. అయితే గరికపాటి అన్న మాటకు చిరంజీవి తమ్ముడు నాగబాబు ట్విట్టర్ వేదికగా ఆన్సర్ ఇచ్చారు. గరికపాటి పై మాటల ఎటాక్ చేశారు. నాగబాబు ఏమని ట్విట్ చేసారంటే..” ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడడం పరిపాటే” అంటూ రాసుకొచ్చారు.. ఈ పదాల్లో పాటి అని పద ప్రయోగం చేసి ఆయన ఎవరిని అంటున్నారో క్లారిటీ గా చెప్పారు. వారి అన్నయ్య ని ఎవరైనా టార్గెట్ చేస్తే వెంటనే స్పందించే నాగబాబు, ఈ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ చేసారు.
Advertisement
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
ప్రస్తుతం నాగబాబు సినిమాల్లో చేయకుండా అన్నయ్య, తమ్ముడు గురించి ఎవరు ఏమంటున్నారో ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే పనిలో పడ్డారు. అయితే ఆయన రానున్న ఎలక్షన్స్ లో ప్రత్యేకంగా రాజకీయాల్లోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ గురించి తమ్ముడు గురించి అన్నయ్య గురించి అప్డేట్ ఇస్తూ ఉంటారు. అయితే నాగబాబు ఆ విధమైన ట్విట్ కు మెగా ఫ్యాన్స్ ఆనందిస్తున్నా కానీ మరో వర్గం మాత్రం అవధాని గురించి ఇలా మాట్లాడటం మంచిది కాదని అంటున్నారు.
also read: