Advertisement
దొంగతనాలు ఈ రోజుల్లో కూడా విపరీతంగా ఎక్కువైపోయాయి. చాలామంది ఆన్లైన్ మోసాలు కూడా చేస్తున్నారు. అలానే ఒక్కొక్కసారి మన ఫోన్లని కూడా కాజేస్తూ ఉంటారు అయితే మొబైల్ ఫోన్లు దొంగతనం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది మొబైల్ ఫోన్లని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ మొబైల్ ఫోన్ పోతే ఈసారి ఆశలు వదిలేసుకోకండి ఇలా చేస్తే తిరిగి వెంటనే మీ ఫోన్ ని పొందొచ్చు. ఫోన్ పోతే చాలామంది కంప్లైంట్ చేసేవారు కాదు. కానీ నిజానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఫోన్ తిరిగి మన చేతుల్లో ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాక చాలా మొబైల్ ఫోన్స్ ని పోలీసులు తిరిగి అప్పగించారు. మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్న బాధితులు మొదట మీసేవ సెంటర్ కి వెళ్లి కంప్లైంట్ చేయాలి.
Advertisement
Advertisement
తర్వాత కంప్లైంట్ కాపీ తో మొబైల్ స్టోర్ కి వెళ్లి అదే నెంబర్ మీద కొత్త సిమ్ తీసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ గానే పాత సిమ్ బ్లాక్ అయిపోతుంది. పనిచేయదు. తర్వాత సిఈఐఆర్ వెబ్ పోర్టల్ లో బ్లాక్ లేదా ఫోన్ లాస్ట్ మొబైల్ మీద క్లిక్ చేయాలి. పోగొట్టుకున్న సెల్ఫోన్లో అప్పటివరకు వినియోగించిన కొన్ని ఫోన్ నెంబర్లు అలానే అక్కడ అడిగిన వివరాలని అందులో ఎంటర్ చేయాలి తర్వాత కొత్త సిమ్ కి రిక్వెస్ట్ ఐడి వస్తుంది. ఆ తర్వాత ఐడి ఆధారంగా కేసు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫిర్యాదు పొందిన 24 గంటల్లోనే ఫోన్ బ్లాక్ చేసి పని చేయకుండా చేస్తారు అప్పుడు వేరే సిమ్ కార్డు వేసుకుంటారు దొంగలు. కంప్లైంట్ చేయడంతో పోలీసులతో పాటుగా బాధితుడికి కొత్త సిమ్ కి మెసేజ్ వచ్చేస్తుంది. ఫోన్ లొకేషన్ కూడా వస్తుంది ఇలా ఈజీగా ఫోన్ ని మళ్ళీ పొందవచ్చు.
Also read: