Advertisement
సినిమా పరిశ్రమలో సెలెబ్రిటీలలో చాలా మంది ఒకసారి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రెండ్ సినీ పరిశ్రమ మొదటి నుంచే ఉంది. అయితే.. ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్న వారిలో కొందరు సంతోషంగా ఉంటె.. మరికొందరు బాధ పడుతూ నరకం చూసిన వారు కూడా ఉన్నారు. ఇలా నరకం చూసిన వారిలో మహా గాయకుడు ఘంటసాల కూడా ఉన్నారు. ఘంటసాల మొదటి భార్య పేరు సావిత్రి. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా, రెండవ భార్య పేరు సరళ. ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సావిత్రి ఘంటసాలకు రెండవ భార్య, పిల్లలు ఉన్నారన్న సంగతి బయట వారికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు.
Advertisement
వీటిని కూడా చదవండి: పెళ్లి చేసుకోనున్న బర్రెలక్క, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్? వైరల్ అవుతున్న న్యూస్..?
అయితే ఘంటసాల మాత్రం వారిద్దరిని ఒక చోట ఉంచాలని అందరూ పిల్లలు కలిసి ఉంటె చూడాలని ఆయన చాలా ఆశ పడేవారు. కానీ సావిత్రి అందుకు ఒప్పుకోలేదు. అసలు ఘంటసాల అంత మానసిక క్షోభకి గురి అయ్యి.. రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా ఒకరకంగా సావిత్రే కారణం. సరళ ఘంటసాల వారు నివాసం ఉండే ఇంటికి పక్క వాటాలో ఉండేవారు. ఆమెను సావిత్రే ఘంటసాలకు పరిచయం చేసారు. ఇంటికి రాకపోకలు బాగానే సాగేవి. ఈ తరుణం లోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలంటూ సరళ ఘంటసాలని కోరేది.
Advertisement
గతంలో ఇటువంటి పరిస్థితినే ఘంటసాల ఎదుర్కొన్నారు. అయితే.. అందుకు ఘంటసాల ఒప్పుకోకపోయేసరికి ఆమె ఆ*త్మ*హ*త్య చేసుకుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో సరళ కూడా ఉండడంతో.. ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆయన మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితులను ఆయన కుమార్తె డా.శ్యామల తెలియచేయడానికి ఆన్ లైన్ ఓ సీరియల్ పత్రిక రాసేవారు. అయితే.. దీనిపై కూడా ఆయన మొదటి భార్య సావిత్రి గొడవ చేసారు. సీరియల్ ను ఆపించేసారు. కానీ, శ్యామల ఆగలేదు. జీవిత కథలు అనేవి వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండాలి అంటూ కోర్టులో కేసు వేసి గెలిచారు. ఆ తరువాత ఘంటసాల గురించి అన్ని విషయాలను అందరికి తెలియచేయాలి అన్న ఉద్దేశ్యంతో “నేనెరిగిన నాన్నగారు” పేరుతొ ఓ పుస్తకాన్ని రాసి ప్రచురించారు. ఈ పుస్తకంలోని రెండవ పెళ్లి తరువాత ఘంటసాల మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
Read More: వైరల్ అయిన కుమారి ఆంటీ ఒకప్పుడు హేమ చంద్ర ఇంట్లో వంట మనిషి అని తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?