Advertisement
నూతన దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు, డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Advertisement
కోన వెంకట్ కథా, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగానే కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేస్తూ సినిమా కలెక్షన్లపై దెబ్బ కొడుతున్నారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Advertisement
ఇదిలా ఉంటే, అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తానికి ఓటిటి లోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. శుక్రవారం అంటే డిసెంబర్ 2 నుంచే జిన్నా మూవీ ప్రైమ్ వీడియో లోకి రానుంది. థియేటర్లో మిస్సయిన ప్రేక్షకులు టీవీల్లో ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. కాగా, ఓ అమ్మాయి రూపంలో మరో యువతి ఆత్మగా రావడం, అందరిని భయపెట్టడం అనే పాయింట్ తో తెలుగులో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ రొటీన్ పాయింట్ కు చాలా కొద్దిగా మార్పులు చేస్తూ జిన్నా సినిమాను రూపొందించిన రచయిత కోన వెంకట్, దర్శకుడు ఈషాన్ సూర్య ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించారు.
#Ginna – PrimeVideo – 12 AM Tonight pic.twitter.com/xvsjFtp1kv
— Aakashavaani (@TheAakashavaani) December 1, 2022
READ ALSO : తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు.. దరఖాస్తు తేదీల వివరాలివే