Advertisement
ఈమధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంది. కొంత మంది విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని బలవన్మ$రణానికి పాల్పడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం వలన కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు ఆర్థిక ఇబ్బందులు వివాహేతర సంబంధాలు మొదలైన కారణాల వలన ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. తాజాగా ఒక జంట గంటల వ్యవధి లో ఆ$త్మహ$త్య చేసుకోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాలను చూస్తే మంచిర్యాల జిల్లా మందమర్రి మామిడి గుట్టలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Advertisement
Advertisement
చిత్తాపూర్ కి చెందిన తీగుళ్ల భగవాన్ మందమర్రి మండలం మామిడి గుట్టకు చెందిన సంగీత లవ్ చేసుకున్నారు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సంగీత కి పెళ్లి చూపులు ని ఏర్పాటు చేసారు. తల్లిదండ్రులని ఎదిరించ లేక ప్రేమించిన ప్రియుడిని దూరం చేసుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆ$త్మహ$త్యకి పాల్పడింది. ఈ విషయం భగవాన్ కి తెలిసి గుండె పగిలి పోయింది. తన ప్రియురాలు లేని జీవితం తనకి వద్దని అనుకున్నాడు.
తీవ్ర మనస్థాపానికి గురైన భగవాన్ చిత్తాపూర్లో పురుగుల మందు తాగేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భగవాన్ మృతదే$హాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి మృతదేహాల్ని కూడా పోస్టుమా$ర్టానికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి వరకు కలిసి సంతోషంగా ఉన్న సంగీత భగవాన్ లేకపోవడంతో ఇరుకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని బంగారు జీవితాన్ని గడపాలనుకున్న ఈ జంట ఇలా అయిపోవడంతో తెలిసిన వాళ్లంతా బాధ పడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!