Advertisement
వివాదాలైన, చిన్న గొడవలైన కేవలం మహిళల వల్లే వస్తాయని మరో సంఘటన రుజురు చేసింది. చిన్న చిన్న విషయాలకే కొందరు సహనం కోల్పోతున్నారు. కోపంతో ఊగిపోతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. ఈ విషయంలో మగవాళ్లే కాదు కొందరు ఆడవాళ్లు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై రౌడీలా బిహేవ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి కచోరీ తినడానికి వెళ్లి అందులో ఉల్లిపాయ లేదని గొడవ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement
ఇంతకీ ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి కచోరి తినడానికి ఒక బండి దగ్గరకు వెళ్ళింది. ఆ అమ్మాయి కచోరి తీసుకొని తింటుండగా, అందులో ఉల్లిపాయలు లేకపోవడంతో ఆ బండి అబ్బాయిని ఉల్లిపాయలు వేయమని అడిగింది. ఆ బండి వ్యక్తి ఉల్లిపాయలు అయిపోయాయి అని చెప్పడంతో ఒకసారిగా కోపంతో ఆ అమ్మాయి అతనిపై విరుచుకుపడింది. ఆ బండి వ్యక్తిని తిడుతూ అతనిపై గొడవకు దిగింది.
Advertisement
ఆ పక్కనే ఉన్న బండిని కూడా ఆ అమ్మాయి కాలితో తన్నడంతో ఆ బండి, అందులో ఉన్న సామాన్లు అన్నీ కూడా కింద పడిపోయాయి. అయినా కూడా ఆ అమ్మాయి కోపం తగ్గలేదు. ఆ బండి వ్యక్తిని చెంపపై కొడుతూ గొడవ పడింది. ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఆ అమ్మాయిని ఆపేందుకు ప్రయత్నించినా వారి మీద కూడా గొడవకు దిగింది ఆ యువతీ. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి భాగోతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఆ అమ్మాయి పై చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Wo stree hai kuch bhi kar sakti hai pic.twitter.com/IyLB45sZzk
— Sarcastic Caravan 🎭 (@Saffron_Smoke) November 7, 2021