Advertisement
మీరు తాజాగా మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బ్రేకప్ చెప్పినట్లు అయితే ఆ బాధను మరిచిపోవడం ఎంత ఇబ్బందో మీకు తెలిసే ఉంటుంది. ప్రేమ అనేది జీవితంలో చిన్న భాగమే కానీ.. ప్రేమే జీవితం కాదు. అయితే ప్రేమే జీవితం కాకపోయినప్పటికీ ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం ఉంటుందో.. ఒకవేళ అందులో విఫలమైతే అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. బ్రేకప్ అయిన తర్వాత మన మనసును ముక్కలు చేసిన ఆ వ్యక్తి గురించి పూర్తిగా మరిచిపోవాలని అనుకుంటాం. కానీ ప్రతి విషయం వారినే గుర్తు చేస్తుంది.
Advertisement
Read also: ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోస్ !
అలాగని పదేపదే వారిని, వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. అయితే కొంతమంది ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయిన తరువాత కూడా వారికి పదే పదే ఫోన్ చేయడం, మెసేజ్ లు పెట్టడం, వారు ఎదురుపడినప్పుడు దగ్గరికి వెళ్లి మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ పాత సంబంధం నుండి బయటపడేందుకు చాలా సమయం తీసుకుంటారు. ఇలా విడిపోయిన తర్వాత అమ్మాయిలు తరచూ ఎలాంటి పనులు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
* బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం:
Advertisement
బ్రేకప్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలు చేసే మొదటి పని తమ మాజీ బాయ్ ఫ్రెండ్ ని వాట్సప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో బ్లాక్ చేయడం వంటివి చేస్తుంటారు. కొందరు ఏకంగా ఫోన్ నెంబర్ ని మార్చేస్తూ ఉంటారు.
* మాజీ బాయ్ ఫ్రెండ్ వ్యవహారాలను కనుగొనడం:
ఇక మరి కొంతమంది అమ్మాయిలు తన మాజీ ప్రియుడు ఇంకా ప్రేమలో ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అతడు కూడా బ్రేకప్ చెప్పినట్లయితే ఏ కారణంగా ఆ అబ్బాయి ఆమెతో విడిపోయాడు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
* సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం:
ఇక మరికొంతమంది ప్రేమించిన వ్యక్తిని త్వరగా, సులువుగా మరిచిపోయేందుకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ వారితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలా కొన్ని రోజులపాటు స్నేహితుడా కలిసి ఇతర ప్రదేశాలకు వెళ్లి రావడం వంటివి కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇవి హృదయాన్ని తేలిక చేస్తాయి. పాత దుఃఖాల నుండి బయట పడేయడానికి చాలా సహాయపడతాయి.
* కెరీర్ పై దృష్టి పెట్టడం:
కొంతమంది అమ్మాయిలు ప్రేమించిన వ్యక్తిని మరిచిపోయే క్రమంలో భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఇప్పటిదాకా జరిగిందంతా ఒక పీడకలలా మరిచిపోయి.. ఇప్పటిదాకా ఏం సాధించాం..? భవిష్యత్తులో ఏం సాధించాలి..? అని కెరీర్ పై దృష్టి పడతారు.
Read also: ఈ సినిమాలు చేసి ఉంటే ఉదయ్ కిరణ్ తిరిగి నిలదొక్కుకునేవాడు!