Advertisement
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. బాహుబలితో సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టే ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు.
Advertisement
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ తో పాటు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు మోడీ. నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రదానోత్సవంలో కీరవాణి దీన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ టీమ్ కు నా అభినందనలు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ల సంబరమే ‘నాటు నాటు’ పాట. దేశంతో పాటు ప్రపంచం మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. తారక్, రామ్ చరణ్, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, దానయ్య, డీవీవీ మూవీస్, ప్రేమ్ రక్షిత్ కు అభినందనలు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
ఇటు కీరవాణిని అభినందిస్తూ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కూడా ట్వీట్ చేశారు. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి భారతీయులందరి తరుఫున శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రెహమాన్ వేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంకా ఇతర సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి ఆసియా పాట ఇదే కావడం విశేషం.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023