Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులకు ఐడి కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. తాజాగా పోసాని మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర కళాకారుల డేటాబేస్ తయారు చేస్తున్నాం. అవకాశాలు డైరెక్ట్ గా అందిపుచ్చుకునే అవకాశం వస్తుందని వెల్లడించారు పోసాని కృష్ణమురళి.
Advertisement
Advertisement
నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామని.. నాటకాలకు 115 ఉత్తమ పుస్తకాల కేటగిరిలో మూడు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు పోసాని. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు స్క్రూట్ని జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 19వ తేదీ అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపికలో పూర్తిగా పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు పోసాని కృష్ణ మురళి. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ అండగా ఉంటామని, ఆర్టిస్టులు టెక్నీషియన్ లందరికీ ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. దీంతో బయటి వారికి ఆర్టిస్టులు ఎంపిక చాలా సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. సినిమా రంగంలో ‘మా’ అసోసియేషన్ ఉంది.. కానీ ‘మా’ లో మెంబర్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి అని తెలిపారు. ఇతర అసోసియేషన్ లోనూ డబ్బులు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోమని స్పష్టం చేశారు పోసాని.