Advertisement
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ ఫిక్స్ డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్ డ్ వడ్డీ రేట్ల విధానానికి మారే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఓ ఫ్రేమ్ వర్క్ ని తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది. కేవలం హోమ్ లోన్ కస్టమర్లు మాత్రమే కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారు ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.
Advertisement
Advertisement
మూడు రోజుల పాటు పరపతి విధాన కమిటీ సమావేశాలు జరిగిన తరువాత ఆర్బీఐ గవర్నర్ తాజాగా మాట్లాడారు. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రెగ్యులేటేడ్ బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులను చేయకుండా కాలవ్యవధిని సవరిస్తుంటాయి. అయితే ఈ విషయంలో రుణ గ్రహీతకు ఎలాంటి సమాచారం ఇవ్వవు. ఫ్లోటింగ్ వడ్డీ విధానంలో బ్యాంకులు తమ వద్ద నుంచి ఎలాంటి సమ్మతి లేకుండానే నిర్ణయం తీసుకుంటున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇందుకు పరిష్కారంగా ఆయా ఆర్థిక సంస్థలు అమలు చేసే విధంగా ఓ ఫ్రేమ్ వర్క్ ని తీసుకురాబోతున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. రుణ కాలాన్ని, ఈఎంఐలో మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు శక్తికాంత దాస్.