Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘బ్రో’ సినిమా విడుదల కాబోతోంది. బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించబోతున్నారు, ఈ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కానీ ఈ సినిమా గురించి అనేక విధాలుగా చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి కూడా ఒక అంశం మీద పెద్దగా చర్చ జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయం గురించే.
Advertisement
అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం.. ఈ సందేహం అసలు అందరికీ ఎందుకు వస్తోంది అనేది చూస్తే… వకీల్ సాబ్ సినిమా టైంలో ఏపీలో జరిగిన విషయాలని మళ్లీ రిపీట్ చేస్తారేమో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏపీలో ధియేటర్ల దగ్గర కొంతమంది ప్రభుత్వాధికారులు, అధికార పార్టీ నాయకులు కాస్త హంగామా చేశారు. ఇప్పుడు బ్రో సినిమా రిలీజ్ అయితే కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని అంతా భావిస్తున్నారు.
Advertisement
పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయంగా బాగా యాక్టివ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ యాక్టివ్ అవడంతో ఏపీలో ఇటువంటివి మళ్లీ జరగొచ్చని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రూల్స్ పేరుతో ఏపీలో ఎక్స్ట్రా షోలు, టికెట్ ధర పెంపు విషయంలో అడ్డుపడే అవకాశం ఉండచ్చు అంటున్నారు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ సినిమాకి ఎటువంటి రూల్స్ కూడా వర్తించలేదు. టికెట్ పెంపుకి కూడా ఒకే అన్నారు. ఒకవేళ కనుక ఇది వరకు లాగే ప్రభుత్వం అడ్డుపడితే సినిమా కలెక్షన్ల మీద ప్రభావం బాగా పడొచ్చు. మరి ఏమవుతుందనేది చూడాలి.
Also read: