Advertisement
సీఎస్ సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సీఎస్ గా ముగ్గురి పేర్లు వినిపిస్తుండగా.. వారిలో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Advertisement
రాష్ట్రంలో ఉన్నతాధికారులైన రామకృష్ణారావు, అరవింద్ కుమార్ లలో ఒకరిని సీఎస్ గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని అంటున్నారు.
Advertisement
అయితే.. రామకృష్ణారావు వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని.. ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అరవింద్ కుమార్ కు మంత్రి కేటీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏమన్నా చక్రం తిప్పితే ఏదైనా జరగొచ్చని అనుకుంటున్నారు. ఇటు రజత్ కుమార్ పేరు కూడా సీఎస్ లిస్టు పరిశీలనలో ఉందని సమాచారం. ఆయన ఇరిగేషన్ శాఖలో కీలకంగా ఉన్నారు.
హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీగాక.. తెలంగాణ నుంచి ఆయన్ను రిలీవ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. తక్షణమే సోమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని.. 12లోగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. సోమేష్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. అక్కడకు వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చని న్యాయశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది.